వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాసంకల్స యాత్రకు కొద్ది రోజులు బ్రేక్ పడనుంది. గురువారం మధ్యాహ్నం జగన్ పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కారణంగా ఆయన ఎడమ చేతికి గాయం కావడంతో హైదరాబాద్ లోని హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసిందే. శుక్రవారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన జగన్ కి కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆది వారం సాయంత్రం మరోసారి వైద్యపరీక్షలు చేసిన తర్వాత ప్రజా సంకల్ప యాత్ర గురించి పూర్తి స్థాయి సమాచారం తెలియనుంది. అప్పటి వరకు ప్రజాసంకల్ప యాత్రకు బ్రేక్ తప్పదు.