తిరుపతిలో నిన్న రాత్రి తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తప్పు జరిగింది. బాధ్యత తీసుకుంటాం. క్షతగాత్రులు రాష్ట్ర ప్రజలు, వేంకటేశ్వరస్వామి భక్తులు, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతీ ఒక్కరినీ క్షమించమని రాష్ట్రప్రభుత్వం అడుగుతోంది.
ఈ ఘటన జరగకుండా ఉండాల్సింది. పోలీసులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత మంది పోలీసులు ప్రజలను ఆపకుండా ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. సంఘటన జరిగాక కూడా పోలీసులకు బాధ్యత లేకపోతే ఎలా? అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలదీశారు. టీటీడీ సిబ్బంది, పోలీసులు ఉండి కూడా ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధకరం అని తెలిపారు. మృతుల కుటుంబాల వద్దకు టీటీడీ సభ్యులు వెళ్లి క్షమాపణలు చెప్పాలన్నారు. టీటీడీ వీఐపీలపై కాదు.. సామాన్యులపై కూడా దృష్టిపెట్టాలన్నారు. తొక్కిసలాట ఘటనకు టీటీడీ ఈవో, ఏఈవో, డ్యూటీలో ఉన్న పోలీసులు బాధ్యత తీసుకోవాలి.