ప్రభుత్వంపై జగన్ హైకోర్టులో పిటిషన్

-


విశాఖ ఎయిర్ పోర్ట్ లో త‌న‌పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం కేసుపై వైసీపీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి బుధ‌వారం హైకోర్టును ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్‍ ప్రభుత్వం వైఫల్యం, సరైన రక్షణ సౌకర్యాలు కల్పించడంలో వైఫ‌ల్యం కారణంగానే త‌న మీద దాడి జ‌రిగింద‌ని, దాడి వెన‌క కుట్ర ఉంద‌ని ఆయ‌న త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు ఉన్నతాధికారులను ప్రతివాదులుగా చేర్చారు. ఏపీ ప్రభుత్వం జరుపుతున్న విచారణపై తనకు నమ్మకం లేదని..కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టే విధంగా ఆదేశించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version