విజయ్ ‘టాక్సీవాలా’ సూపర్ హిట్

-

విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా టాక్సీవాలా. గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ కలిసి నిర్మించిన ఈ సినిమా లీక్ అవడం వల్ల సినిమా మీద అంత బజ్ ఏర్పడలేదు. నవంబర్ 16న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రిలీజ్ కు ముందే సేఫ్ జోన్ లోకి వెళ్లింది. అదెలా అంటారా సినిమా మొత్తం బడ్జెట్ 6 కోట్లు కాగా సెట్స్ మీద ఉన్నప్పుడే ఈ సినిమా శాటిలైట్ అయ్యిందట.

ప్రముఖ ఛానెల్ రెండున్నర కోట్లకు ఈ సినిమా కొనేశారట. ఇక రావాల్సింది కేవలం మూడున్నర నుండి నాలుగు కోట్లు మాత్రమే అది కూడా విజయ్ స్టామినాకు పెద్ద లెక్కేం కాదు అంటున్నారు నిర్మాతలు. నోటా ఫ్లాప్ అయినా 10 కోట్ల దాకా వసూళు చేసింది ఆ లెక్కన చూస్తే టాక్సీవాలా రెండు రోజుల్లో లాభాల్లోకి వచ్చేస్తుంది.

తన రేంజ్ పెరిగినా కూడా బడ్జెట్ విషయంలో విజయ్ తీసుకుంటున్న జాగ్రత్త వల్ల సినిమా ఫ్లాప్ అయినా పెద్దగా నష్టాలు రావడం లేదు. అయితే నోటా తమిళ సినిమా కిందకే లెక్క కడితే గీతా గోవిందం తర్వాత టాక్సీవాలాతో విజయ్ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version