ప్రభుత్వ సంస్థలో 260 టీచర్‌ ఉద్యోగాలు…ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. న్యూఢిల్లీ లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బిలరీ సైన్సెస్‌ లో 260 పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. సీనియర్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అడిషనల్‌ ప్రొఫెసర్ పోస్టులు వున్నాయి.

అలానే అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కన్సల్టెంట్, హెడ్ ఆపరేషన్స్ తదితర పోస్టులు ఖాళీగా వున్నాయి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకునే వారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఇంటర్మీడియట్‌/డిప్లొమా/డిగ్రీ/ బీఎస్సీ నర్సింగ్‌/ఎంబీబీఎస్‌/ఎండీ లేదా తత్సమాన కోర్సు ప్యాస్ అయ్యి ఉండాలి.

ఇక వయస్సు విషయానికి వస్తే…వయసు 30 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే ఫిబ్రవరి 28, 2023వ తేదీ లోపు అవకాశం వుంది. కనుక ఈ లోగా అప్లై చేసుకో వచ్చు. రూ.590లు అప్లికేషన్‌ ఫీజు గా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌/వికలాంగ/మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించక్కర్లేదు. రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అధికారిక నోటిఫికేషన్‌ లో పూర్తి వివరాలను https://www.ilbs.in/ చెక్ చేసుకో వచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version