ప్రాణ ప్ర‌తిష్ట వేడుక‌కు 55 దేశాల నుంచి 100 మంది ప్ర‌ముఖుల‌ హాజ‌రు

-

జ‌న‌వ‌రి 22న అయోధ్య‌లో జరిగే రామాల‌య ప్రారంభోత్స‌వ వేడుక‌ల‌కు స‌ర్వం సిద్ధ‌మైంది.ఈ కార్య‌క్ర‌మానికి 55 దేశాల నుంచి రాయ‌బారులు, ఎంపీలు స‌హా దాదాపు 100 మంది హాజ‌రు కాబోతున్నారు. ప్రభు శ్రీరామ్ వంశజ్ అని చెప్పుకునే కొరియన్ రాణితో పాటు ప‌లు దేశాధినేత‌లను కూడా ఆహ్వానించామ‌ని ప్ర‌పంచ హిందూ ఫౌండేష‌న్ గ్లోబ‌ల్ చైర్మ‌న్ స్వామి విజ్ఞానానంద వెల్లడించారు.

అర్జెంటీనా, ఆస్ట్రేలియా,అమెరికా, న్యూజిల్యాండ్‌, డెన్మార్క్‌, డొమ్నిక్‌,ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీ, ఘ‌నా, బెలార‌స్‌, కాంగో, ఈజిప్ట్‌, ఫిజీ,గుయానా, హాంకాంగ్‌, ఫిన్లాండ్,బొత్స్వానా, కెన‌డా, ఇండోనేషియా, బ్రిట‌న్‌,కొలంబియా, ఇథియోపియా, హంగ‌రీ, ఇట‌లీ,సింగ‌పూర్ స‌హా ప‌లు దేశాల నుంచి అతిధుల‌కు ఆహ్వానాలు అందించామ‌ని చెప్పారు.వీవీఐపీ విదేశీ ప్ర‌తినిధులు జ‌న‌వ‌రి 20న ల‌క్నో వ‌స్తార‌ని ఆ మరుసటి రోజు జ‌న‌వ‌రి 21 సాయంత్రానికి అయోధ్య చేరుకుంటార‌ని ఆయ‌న వెల్లడించారు..ఇక జ‌న‌వ‌రి 22న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ స‌హా ప‌లువురు ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో శ్రీరాముడి విగ్ర‌హ ప్రాణ ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version