సంక్రాంతి 2024 : గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు ?

-

సంక్రాంతి పండుగలో ముగ్గులు ప్రత్యేకం అయితే ముగ్గులకు ప్రత్యేకం గొబ్బెమ్మలు. అసలు ఈ గొబ్బెమ్మల విశేషాలు తెలుసుకుందాం..

పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతం. ఈ ముద్దల తలమీద కనుపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ భర్తలు జీవించియున్న పుణ్య స్త్రీలకు సంకేతం. ఆ గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే గోపీ+బొమ్మలు= గొబ్బెమ్మలు. మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్థిస్తుంటారు.

దీనిని సందే గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి, దానిపై గుమ్మడి పూలుతో అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది. అంతేకాదండోయ్‌ ఆవుపేడతో చేసే ఈ గొబ్బెమ్మలతో సూక్ష్మజీవులు రావని, దీనివెనుక యాంటీబయాటిక్ ట్రీట్‌మెంట్‌ ఉందని పెద్దలు చెప్తారు. హిమమంత రుతువు చివరిరోజులు కాబట్టి రకరకాల క్రిములు వచ్చే అవకాశం ఉంది వాటన్నింటి నుంచి ఆవుపేడ రక్షిస్తుందని శాస్త్రీయత తెలిసన వారు పేర్కొంటున్నారు. ఆవుపేడపై వేసే నవధ్యానాలు, శనగలు పిండి ఇవి ఆయా జీవులకు ఆహారంగా ఉండటమే కాకుండా జీవకారుణ్యాన్ని నేర్పిస్తాయి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version