ఇవాళ హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, పీఈసీ సభ్యులు హాజరు అయినారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…60 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ‘లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాల కోసం కృషి చేయాలి. ప్రజల్లోకి వెళ్లేందుకు ఫిబ్రవరి 2 నుంచి సభలు నిర్వహిస్తున్నాం. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయాలి అని అన్నారు.పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించాలి. అభ్యర్థుల ఎంపికను పూర్తిగా అధిష్ఠానం చూసుకుంటుంది’ అని వెల్లడించారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలన్నీ అమలు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం కార్యచరణ రూపొందించిందని వెల్లడించారు.ఎన్నికల సమీపిస్తున్న వేళ ప్రజల్లోకి వెళ్లి ఫిబ్రవరి 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా మొదటగా ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని కోరారు.