ఫొటో లేదని అలిగిన మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ        

-

అమీర్‌ పేట నుంచి ఎల్బీ నగర్‌ వరకూ మెట్రో రైలు ప్రయాణాన్ని సోమవారం  గవర్నర్ నరసింహన్‌ జెండా ఊపీ ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంలో గవర్నర్ తో పాటు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం  అమీర్‌ పేట నుంచి ఎల్బీనగర్‌ కు మెట్రో రైలులో వీరంతా ప్రయాణించారు. ఈ ప్రయాణంలో  ‘మెట్రో’ రైలుపై ప్రధాని మోడీ ఫొటో లేకపోవడంపై దత్తాత్రేయ అసంతృప్తి వ్యక్తం చేశారు.  దీంతో ఆయన ఎంజీబీఎస్స్‌ స్టేషన్‌లో రైలు ఆగగానే దిగిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version