ఘంటసాల బయోపిక్..!

-

మహానటి సినిమా తర్వాత బయోపిక్ సినిమాలపై సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే ఎన్.టి.ఆర్, వైఎస్సార్ బయోపిక్ లు తీస్తున్నారు. ఇదే కాకుండా ఇప్పుడు మరో బయోపిక్ సినిమా తెరరూపం దాల్చబోతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు జీవిత చరిత్రతో సినిమా వస్తుందట.

ప్రముఖ సింగర్ కృష్ణ చైతన్య ఘంటసాలగా కనిపించబోతున్నారట. సిహెచ్ రామారావు దర్శకత్వంలో ఈ బయోపిక్ సినిమా తెరకెక్కుతుంది. కొద్దికాలంగా ఘంటసాల జీవితంపై రీసర్చ్ చేసి మరి ఈ సినిమా చేస్తున్నారట. వాసు రావు ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి మిగతా డీటైల్స్ త్వరలో వెళ్లడిస్తారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version