తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరో మూడు రోజుల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఇక ప్రచార కార్యక్రమాలు అన్నీ కూడా రేపు సాయంత్రంతో బంద్ కానున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా గెలవకపోయినా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వాతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క అలియాస్ శిరీష గెలుపు కోసం చాలా మంది నిరీక్షిస్తున్నారు. ఈమెకు జనసేన, రామ్ గోపాల్ వర్మ , మాజీ సిబిఐ జెడి లక్ష్మీనారాయణ లాంటి వారు మద్దతుగా ఉన్నారు. ఇక ఈ చోట బర్రెలక్క కు భారీగా సానుభూతి ఏర్పడింది. ఇన్ని అనుకూలతలు మధ్యన బర్రెలక్క గెలిస్తే ? అధికారం ఏర్పాటు చేసే పార్టీ కి అమ్ముడు పోతుందా లేదా అన్న సందేహాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి.
ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూ లోనూ బర్రెలక్క కు ఎదురైనా ఈ ప్రశ్నకు సమాధానంగా నేను నిరుద్యోగుల పాలిట నిలబడి పోరాడుతున్నాను, ఎటువంటి పరిస్థితుల్లోనూ గెలిచినా గెలవకపోయినా నా ఒంటరి పోరు కొనసాగుతుంది అంటూ ఖచ్చితంగా చెప్పేసింది.