బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి

-

కొండగట్టు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా ఘటనపై భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తీవ్ర  విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుత తన ఆలోచనలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులు,  క్షతగాత్రుల చుట్టే తన ఆలోచనలు ఉన్నట్లు … రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం క్షతగాత్రులను ఆదుకుంటోందని  ఆశిస్తున్నాను అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో దాదాపు 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘాట్ రోడ్డులోని చివరి మలుపు వద్ద బస్సు అతివేగం కారణంగా అదుపు తప్పి లోయలోకి పడిపోవడంతో  ప్రమాద తీవ్రత అధికంగా ఉందని తెలుస్తోంది. బస్సు డ్రైవర్ శ్రీనివాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆర్టీసీ చరిత్రలో మునుపెన్నడు  జరగని విధంగా ప్రమాదం జరిగింది.

ప్రముఖుల సంతాపం…

కొండగట్టు బస్సు ప్రమాద ఘటనపై గవర్నర్ నరసింహన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news