బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.బిహార్ ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ క్షమాపణలు చెప్పాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. నితీశ్ తో పాటు ఆర్జేడీ, బీజేపీ పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నితీశ్ మాపై ఆరోపణలు చేసి ఇప్పుడు బీజేపీ ఒళ్లో కూర్చున్నారు. ఆయన సిద్ధాంతపరుడు కాదని, బీజేపీలోకి వెళ్తారని మేం ముందునుంచే చెబుతున్నాం. ఆయన ఎప్పుడూ బీజేపీ చేతిలో కీలుబొమ్మే’ అని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.
ఇండియా కూటమి లో తమకు సముచిత స్థానం దక్కడం లేదని బీహార్ సీఎం నితీష్ కుమార్ కూటమి నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. కూటమి నుంచి వైదొలిగిన తర్వాత ఎన్డీఏ జతకట్టి బీహార్లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ నిన్న నితీష్ కుమార్ తొమ్మిదవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.