బి.సుశీలకు రాష్ట్రస్థాయి సావిత్రిబాయి పూలే అవార్డు

-

నిర్మల్ జిల్లా లోని దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఎస్జిటి గా బి.సుశీల పనిచేస్తున్నది. ఇవాళ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా విద్యారంగంలో సేవలు అందించడంతో బి.సుశీలకు రాష్ట్రస్థాయి సావిత్రిబాయి పూలే అవార్డును హైదరాబాద్ లో గిరిజన శాఖ మంత్రి సీతక్క అందజేశారు.సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలువురు మహిళా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా నుంచి సుశీలకు ఈ అవార్డు దక్కడం పట్ల జిల్లాకు చెందిన పలువురు అభినందనలు తెలుపుతూ ఉన్నారు.

ఆమెకి పురస్కారంతోపాటు ప్రశంసా పత్రం అందజేసి, ఘనంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క చేతుల మీద సన్మానం పొందారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకటి,మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ రావు,జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, సంఘ నాయకుడు భీమన్న, తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news