వ్యాపార కేంద్రంగా మారుతోన్న అయోధ్య.. పుట్టుకొస్తున్న గోల్డ్‌ షాప్స్‌, ఎగబాకుతున్న ల్యాండ్‌ రేట్స్‌ 

-

జనవరి 22న అయోధ్యలో రామమందిర శంకుస్థాపన జరగనుండంతో నగర భవితవ్యం పూర్తిగా మారిపోనుంది. అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ రాబోయే కొద్ది నెలల్లో నగరానికి ప్రతిరోజూ సుమారు 3 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తారని అంచనా వేస్తోంది. ఇలాంటి ప్రత్యేక అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు చాలా కంపెనీలు సన్నాహాలు ప్రారంభించాయి. అయోధ్య వ్యాపార కేంద్రంగా మారుతోంది. ఇదిలా ఉండగా ఆభరణాల విక్రయదారు కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (జనవరి-మార్చి) అయోధ్యలో తన 250వ దుకాణాన్ని ప్రారంభించబోతోంది.
రెగ్యులేటరీ ఫైలింగ్‌లో, కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం మరియు పశ్చిమాసియాలో 30 కొత్త దుకాణాలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. వీటిలో భారత్‌లో 15, పశ్చిమాసియాలో 2, 13 క్యాండీ షాపులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. డిసెంబర్ 2023 చివరి వరకు, కళ్యాణ్ జ్యువెలర్స్ భారతదేశం మరియు పశ్చిమాసియాలో మొత్తం 235 దుకాణాలను కలిగి ఉంది. కంపెనీ ఇప్పుడు తన 250వ దుకాణాన్ని అయోధ్యలో ప్రారంభించబోతోంది. ఇది అయోధ్య ప్రజలకు మేలు చేస్తుంది. దీనిపై కంపెనీ కూడా చాలా ఉత్సాహంగా ఉంది.
 రామ మందిర నిర్మాణం కారణంగా అయోధ్యలో భూములు, ఆస్తుల ధరలు నాలుగు రెట్లు పెరిగాయి. వీటి ధరలు మరింత వేగంగా పెరగనున్నాయని ప్రాపర్టీ నిపుణులు అంటున్నారు. విదేశీ పెట్టుబడిదారులు మరియు స్థానిక కొనుగోలుదారులు వేగంగా పెట్టుబడి పెడుతున్నారు. బిస్లరీ లాంటి కంపెనీలే కాకుండా తాజ్, రాడిసన్ లాంటి పెద్ద హోటల్ చెయిన్లు కూడా ఇక్కడికి రావడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి. చాలా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా రామనగరిపై దృష్టి పెట్టాయి. రానున్న కాలంలో అయోధ్య వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతుందనటంలో ఏమాత్రం సందేహం లేదు.
ఇవి మాత్రమే కాదు.. అక్కడ హోటళ్లు, ఫుడ్‌ ప్రతీది పెరుగుతుంది. రామ జన్మభూమిలో వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందనే అంచనాలు చాలా మందిలో ఉన్నాయి. అందుకే కోట్లు పెట్టుబడి పెట్టి మరీ వారి వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news