మహిళా ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ అలర్ట్‌.. ఉచిత ప్రయాణానికి ఆ కార్డు చెల్లదు

-

మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలంటే ఒరిజినల్‌ గుర్తింపు కార్డు కచ్చితంగా ఉండాలని టిఎస్ ఆర్టిసి స్పష్టం చేసింది. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని ట్విట్టర్‌లో సజ్జనార్‌ పోస్ట్ చేశారు. పాన్ కార్డు తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్‌ గుర్తింపు కార్డైనా ఈ పథకం వర్తిస్తుందని ఆయన తెలిపారు.

ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ అడుగుతున్నప్పటికి కొంత మంది మహిళలు స్మార్ట్‌ ఫోన్లలో, కలర్‌ జిరాక్స్ ,ఫొటో కాపీలు చూపిస్తున్నారని, ఇలా చేయడం వల్ల సిబ్బందికి ఇబ్బంది కలగడంతో పాటు ప్రయాణికులకు కూడా అధిక సమయం పడుతుంది. దీనివల్ల ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోంది. ఒరిజనల్‌ గుర్తింపు కార్డును చూపించి మాత్రమే మహిళా ప్రయాణికులందరూ జీరో టికెట్‌ ను తీసుకోవాలని కోరుతున్నాం. ఒరిజినల్‌ గుర్తింపు కార్డు లేకుంటే డబ్బు చెల్లించి టికెట్‌ తీసుకోవాలని కోరారు. తెలంగాణలోని మహిళలకి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు తప్పనిసరిగా చార్జీలు చెల్లించి టికెట్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

చార్జీలు లేకుండానే టికెట్ ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ ఒరిజినల్ ప్రూఫ్ ఎందుకని వాదిస్తున్న మహిళలు అందరూ జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును TSRTC కి ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తుందని అర్థం చేసుకోవాలి అని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news