వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా అని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఎమ్మెల్యేగా మళ్లీ గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో పరిస్థితులు అన్నీ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని ఆయన అన్నారు.
మైలవరం నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలు ఇబ్బందికరమైన పరిస్థితులను కలగజేస్తున్నాయనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని చూసి విసుగు చెందిన తనాని సీఎం జగన్ పిలిచి అన్నీ వివరంగా చెప్పడంతో ఆ తర్వాత రెండోసారి పోటీ చేయాలని నిర్ణయించుకున్నా అని వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. సొంత పార్టీలోనే ఉన్న కొన్ని శక్తులు చేస్తున్న బూడిద అక్రమ తరలింపు,అక్రమ దందాలు, ఇతరత్రా అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు అని ఆయన హెచ్చరించారు.
విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నానికి, నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని,నా నియోజకవర్గ అభివృద్ధికి పార్లమెంట్ నిధుల విషయంలో కేశినేని నాని చాలా సహకరించారని చెప్పారు. మాజీమంత్రి దేవినేని ఉమ నాపై అసత్య ప్రచారాలు చేస్తుండడంతో ఆయనపై లీగల్ నోటీసులు ఇచ్చానని చెప్పారు.దేవినేని ఉమ బహిరంగ క్షమాపణ చెప్పకుంటే చట్ట ప్రకారం ఆయనపై ప్రొసీడ్ అవుతానని హెచ్చరించారు.