‘మీటూ’ కేసుల పరిశీలనకు కమిటీ…మేనకా గాంధీ

-

దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న ‘మీటూ’ ఉద్యమంలో రోజురోజుకి బాధితుల సంఖ్య  పెరుగుతోంది… ఈ నేపథ్యంలో వారి కేసులను పరిశీలించి దర్యాప్తు చేసేందుకు విశ్రాంత న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాక మంత్రి మేనకా గాంధీ తెలిపారు.  పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కొన్నేళ్ల క్రితం, ప్రస్తుతం లైంగిక వేధింపులు ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరుఫున బాధితులకు అండగా నిలుస్తామని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఫిర్యాదు వెనుక ఉన్న బాధ, గాయాలను తాను విశ్వసిస్తానని తెలిపారు. ఈ కేసులపై విచారణ జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని ఇప్పటికే అనేక  ప్రతిపాదనలు వస్తున్నట్లు వివరించారు. వివిధ రంగాల్లోని మహిళలను అనేక రకాల కారణాలతో వేదింపులకు గురిచేస్తున్నవారికి మీటూ వేదిక గుణపాఠం కావాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version