పార్టీల సందేహాలను తీరుస్తాం…
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి కలెక్టరేట్ లో ఎన్నికల కార్యాలయాన్ని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఈ సారి జరగబోయే ఎన్నికల్లో అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈవీఎంను ఉపయోగించనున్నామని తెలిపారు. ఈవీఎంల ఉపయోగం, ఓటు హక్కు వినియోగం పై వివిధ వర్గాల ప్రజల నుంచి అనేక సందేహాలు వస్తున్నాయని అందరికి వీటిపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఎన్నికల ముందు నుంచి ముగిసే వరకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తామన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు బ్యాలెట్ విధానం అమలుచేయాలని కోరుతున్నారు…ఇప్పుడు ఆ తరహా ప్రక్రియ సాధ్యంకాదని వివరించారు. ఎన్నికల సంఘం ఏ రాజకీయ పార్టీకీ అతీతంగా పనిచేయదని ఆయన తెలిపారు. 19.5 లక్షల మంది కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారని రజత్ కుమార్ తెలిపారు.