రాజకీయ కుట్రలో భాగంగానే  ఏపీలో ఐటీ సోదాలు..చంద్రబాబు

-

కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత ధోరణిని అవలంబిస్తోందని  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రోజు సాయంత్రం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చజరిపినట్లు తెలుస్తోంది. రాజకీయ కుట్రలో భాగంగానే తెదేపా నేతలు, పలు వ్యాపార సంస్థలపై ఐటీ దాడుల చేస్తోందని సర్వత్రా చర్చకొనసాగుతోంది. ఐటీ అధికారులకు భద్రత కల్పించడంపై న్యాయశాఖ అభిప్రాయం కోరగా …తప్పనిసరిగా కల్పించాలని ఎక్కడా లేదని వారు పేర్కొన్నారు.గ్రామల నుంచి వచ్చే ప్రజల దగ్గర నుంచి ఆసుపత్రులు ప్రజలను దండుకుంటున్నాయని సమావేశంలో మంత్రులు ప్రస్తావించగా… అలాంటి ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వివిధ సంస్థలు రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఆర్డీఏకు రూ.10వేల కోట్లు, ఆర్టీసీకి రూ.500 కోట్ల మేర రుణ సమీకరణకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వనుంది. గండికోట రిజర్వాయర్‌ నిర్వాసితుల పునరావాసానికి రూ.146 కోట్లు కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version