వైఎస్ తెలంగాణకి తీరని అన్యాయం చేసిండు…కేసీఆర్

-

కాంగ్రెస్ పార్టీని పాతరేయాలి…

వనపర్తి సభలో కాంగ్రెస్ పాలకులు, నేతలపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ…  ఆంధ్రా పాలకులు పాలమూరు జిల్లాను పట్టించుకోలేదన్నారు. గత ముఖ్యమంత్రులు చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ తెలంగాణ ప్రజలను పీక్కు తీన్మారు. మన ప్రాంతంలో  ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టి,  ఆంధ్రప్రాంతానికి కాలువల ద్వారా నీటిని తరలించారు. పొతిరెడ్డిపాడుతో పాలమూరుకు నష్టం లేదని నాడు చిన్నారెడ్డి పత్రికల్లో వ్యాసాలు రాశాడు. కుక్కకు బొక్కేసినట్టు మంత్రి పదవి కోసం ఆయన సమైక్య పాలనను సమర్థించార’ని కేసీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. స్థాయి మరచి కొంత మంది స్వప్రయోజనాల కోసం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు… డీకే అరుణ ఒళ్లు దగ్గరుంచుకొని మాట్లాడాల’ని కేసీఆర్ సూచించారు.

గడిచిన నాలుగేళ్లలో పాలమూరు జిల్లా రూపురేకలు ఎలా ఉన్నయో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో మహబూబ్‌నగర్‌ కరువు, వలసలు, పెండింగ్ ప్రాజెక్టులకు అడ్డాగా మారిందన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని సర్వం దోచుకున్న కాంగ్రెస్ పార్టీని ఇక తెలంగాణ ప్రజలు బొందపెట్టాలని కోరారు. అలాంటి పార్టీ నేతలు మరో సారి ఆంధ్రపాలకులతో కలిసి ప్రజలను మోసం చేసేందుకు నోటికొచ్చిన ఆబద్దాలు మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గొర్రెల పెంపకం విలువేంటో కాంగ్రెస్ గొర్రెలకు  తెలియలేదు. రోజూ 650 లారీల గొర్రెలు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు దిగుమతి అవుతున్నాయి. అది గమనించే గొర్రె పిల్లలు పంపిణీ చేశాం. తెలంగాణలోని యాదవులు దేశంలోనే ఆర్థికంగా బలవంతులైన వారిగా ఎదుగుతారు

Read more RELATED
Recommended to you

Exit mobile version