రాఫెల్ వివరాలను సుప్రీంకి ఇవ్వలేం…కేంద్రం

-

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో జరిగిన అవినీతిపై రాజుకున్న వివాదంలో కేంద్ర ప్రభుత్వం మరింత లోతుగా ఇరుక్కుంది. విమానాల ఒప్పందానికి అయిన ఖర్చు, యుద్ధవిమానాల ధర తదితర వివరాలను సీల్డు కవర్‌లో తమకు అందించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. రాఫెల్ కు సంబంధించిన వివరాలను గతంలో పార్లమెంట్‌లోనే వెల్లడించలేదని పేర్కొంటూ వాటిని అందచేయలేమని తెలిపింది. ఆ సందర్భంగా ”ఒప్పందం విలువ, యుద్ధ విమానాలకు సంబంధించిన వివరాలను పది రోజుల్లోగా సీల్డు కవర్‌లో సుప్రీం కోర్టుకు సమర్పించాలి” అని కేంద్రానికి ఆదేశించింది. కేవలం ధరకు సంబంధించిన వివరాలను మాత్రమే తాము అడుగుతున్నామని, సాంకేతికపరమైన వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రం ఇచ్చిన వివరణతో విభేదించిన సుప్రీం తాము ఏం చెప్పాలనుకున్నారో అదే విషయాన్ని రాత పూర్వకంగా అందించాలన ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news