సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తుమ్మల నాగేశ్వరరావుగారు రాష్ట్రంలో పామాయిల్ సాగుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని..ఆయిల్ పామ్ సాగు రైతు జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని అన్నారు. శుక్రవారం సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత,జౌళి శాఖల మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే తుమ్మల నాగేశ్వరారవు మూడు కీలక దస్త్రాలపై సంతకాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొత్తం 5 ఆయిల్ పామ్ పరిశ్రమలు నెలకొల్పే దస్త్రంపై మంత్రి తొలి సంతకం చేశారు. రూ.1050 కోట్లతో 5 పామాయిల్ పరిశ్రమలు స్థాపించే ఫైలుపై మంత్రి తొలి సంతకం చేశారు. రాష్ట్రంలోని 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేలా రూ.4.07కోట్లతో సాంకేతిక పరిజ్ఞానంతో రైతు వేదికల్ని తీర్చిదిద్దేందుకు రెండో సంతకం చేశారు. సహకార వ్యవస్థలో పారదర్శకమైన పాలన అందించేందుకు గానూ వివిధ విభాగాలను పూర్తిగా కంప్యూటరీకరణ చేసేందుకు అవసరమైన చర్యల కోసం మంత్రి మూడో దస్త్రంపై సంతకం చేశారు.
రాష్ట్రంలోని సహకార కమిషనర్, రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీలతోపాటు జిల్లా సహకార కార్యాలయాల్లో అన్ని రకాల కార్యకలాపాలను కంప్యూటరీకరించాలని అధికారులకు మంత్రి సూచించారు. . ఈ సందర్భంగా అధికారులతో తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రం లో వచ్చే ఐదేళ్ల లో ఏడాదికి ఒకటి చొప్పున పామాయిల్ పరిశ్రమలను ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం నెల కొల్పుతామన్నారు.పామాయిల్ సాగు విస్తరణకు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లుల స్థాపన ఎంతగానోఉపయోగపడుతుందన్నారు