రాహుల్ కలలు కంటున్నారు… అమిత్ షా

-

రాహు ల్‌గాంధీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పగటి కలలు కంటున్నారని అమిత్‌షా విమర్శించారు. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్ లో  జరుగుతున్న బీజేవైఎం మహా యువభేరి ముగింపు సభలో  భాజపా అధ్యక్షుడు అమిత్‌షా మాట్లాడుతూ… తెలంగాణలో కాంగ్రెస్ సారధిలేని రథం అంటూ ఎద్దేవా చేశారు.  రాహుల్‌గాంధీ ప్రధాని అభ్యర్థి కాదని కాంగ్రెస్‌ పార్టీ నేతలే చెబుతున్నారని గుర్తుచేశారు. మోదీ పాలనలో నిరుపేదలు, రైతులు, మహిళలు, యువత, ఎస్సీ, ఎస్టీ అన్నివర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని వివరించారు. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన మహా నేత సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ అని అన్నారు. మజ్లిస్‌, ఓవైసీ భయంతోనే తెలంగాణ ప్రభుత్వం విమోచన దినోత్సవం నిర్వహించడం లేదని ఆరోపించారు. 2019లో మోదీ మరో సారి ప్రధాని కావడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news