వార ఫలాలు: ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది..

-

అక్టోబర్ 28 – నవంబర్ 3 వరకు
మేషం: గ్రహా అననుకూలతతో పనుల్లో విఘ్నాలు ఎదురవుతాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు కలిసి రాకపో-వచ్చు. కిరాణం, ఇంజినీరింగ్ వృత్తిలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. పెద్దల సలహాలను తప్పక పాటించాలి. ఆర్థిక భారం పెరిగే సూచనలు ఉన్నాయి. దుర్గాదేవి ఆరాధన, శివారాధన, నవగ్రహరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

వృషభం: ఈ రాశివారికి గ్రహసంచారం అనుకూలంగా ఉంది. మిత్రుల సహాయంతో, శ్రద్ధతో పనులు ప్రారంభించడం, చేయడం వల్ల చాలా పనులు సఫలీకృతం అవుతాయి. రాజకీయ, కోర్టు వ్యవ-హారాల్లోనూ అనుకూల ఫలితాలుంటాయి. నలుగు-రిలో మంచిపేరు పొందుతారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. లక్ష్మీ, కార్తికేయ లేదా నాగదేవతారాధన శుభ ఫలితాన్ని ఇస్తుంది.

మిథునం: గ్రహసంచారం అనుకూలంగా ఉంది. దీంతో ఆర్థికంగా బాగా ఉంటుంది. కుటంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో కొంత ప్రతికూలత ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించాలనుకుంటే పెద్దల సలహాలు, సూచనలు తీసుకోండి. కులదేవతారాధన, నవగ్రహారాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

కర్కాటకం: గ్రహసంచారం అనుకూలంగా ఉంది. ఇప్పటివరకు పడ్డ కొన్ని ఇబ్బందులు తొలిగిపోతాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. సినిమా, హోటల్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఇష్టదేవతారాధన లేదా ఆంజనేయస్వామి దేవాలయ దర్శనం శుభ ఫలితాలను ఇస్తుంది.

సింహరాశి: గ్రహసంచారం అనుకూలంగా ఉంది. కిరాణ, షేర్ బిజినెస్‌ల్లో ఉన్న వారికి అనుకూలం. ఇంజినీరింగ్, నిర్మాణ రంగంలో ఉన్నవారికి పాత సమస్యలు పరిష్కారమవుతాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. అమ్మవారి పూజ, ఆంజనేయారాధన మంచిది.

కన్యారాశి: గ్రహసంచారం మిశ్రమం. శ్రమకు ఫలితం దక్కుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటంబ సౌఖ్యం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఓపికతో పనిచేయడం మంచింది. కింది స్థాయి వారితో గొడవలు ఉండొచ్చు. అవసరాలకు ధనం లభిస్తుంది. శివారాధన, సూర్య, విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మంచిది. పేదలకు భోజనం పెట్టండి.

తులారాశి: గ్రహసంచారం అనుకూలంగా ఉంది. కొత్తగా ప్రారంభించే పనులు ఫలిస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వస్త్ర, ఫ్యాన్సీ, కిరాణ వ్యాపారంలో వారికి అనుకూ-లం. హోటల్, క్యాటరింగ్ బిజినెస్‌లో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. శివ ఆరాధన, ఆదిత్య హృదయం పఠనం మంచిది.

వృశ్చికరాశి: గ్రహసంచారం అనుకూలంగా ఉంది. శుభసమయం. కుటంబంలో ఆనందం. విందులకు, వినోదాలకు హాజరవుతారు. హోటల్, క్యాటరింగ్ బిజినెస్‌లో ఉన్న వారికి వస్త్ర వ్యాపారంలో ఉన్న వారికి అనుకూలం. పెద్దల సూచనలు పాటించడంతో పనులు నెరవేరుతాయి. అన్నదమ్ములు, బంధువులతో సఖ్యత కుదురుతుంది. వాదాలకు, వివాదాలకు దూరంగా ఉండండి. బంధువులు, స్నేహితులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అమ్మవారి దేవాలయ దర్శనం, గణపతి, సుబ్రమణ్య ఆరాధన చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి.

ధనస్సురాశి: ఈ వారంలో ఈ రాశి వారు భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు ఈ వారం కొంత అనుకూలంగా ఉంటుంది. నలుగురిలో మంచి పేరు పొందే అవకాశం ఉంది. రాజకీయాల్లో కార్యకర్తల సహాయ సహకారాలు ఉంటాయి. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లో ఉన్న వారికి కొత్త అవ-కాశాలు వస్తాయి. హోటల్, క్యాటరింగ్, వస్త్ర, నిత్యా-వసర వస్తు వ్యాపారంలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అ.తే.: 28, 29, 30. చే.స్తో.పా.: గణపతి స్తోత్రం, దుర్గా స్తోత్రం, హను-మాన్ చాలీసా.

మకరరాశి: గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కుటంబంలో సంతోష వాతావరణం. శుభకార్యాలు చేసే అవకాశం. షేర్ బిజినెస్‌లో నిత్యావసర వస్తు వ్యాపారంలో ఉన్నవారికి, ఇంజినీరింగ్, న్యాయ-వాద, ఉపాధ్యాయ వృత్తిలో వారికి చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వాహనాల వల్ల అనవసరమైన ఖర్చులుంటాయి. గణపతి, ఆంజనేయస్వామి దేవతారాధన మంచిది.

కుంభరాశి: గ్రహసంచారం అనుకూలం. ఆర్థిక అవసరాలు తీరుతాయి. కుటంబంలో సంతోషకరమైన వాతావరణం. హోటల్, క్యాటరింగ్, వస్త్ర, కిరాణంలో ఉన్నవారికి అనుకూలం. న్యాయవాద, వైద్య వృత్తిలో ఉన్న వారికి మంచికాలం. సూర్యారాధన, విష్ణు సహస్రపారాయణం మంచిది.

మీనరాశి: గ్రహసంచారం అనుకూలం. పిల్లల చదువులు, శుభకార్యాలు, కొత్త పనుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభసమయం. పెద్దల మాట వినడం వల్ల చాలాపనుల్లో అనుకూలం. బంధువర్గంతో సఖ్యత ఉంటుంది. ఆస్తుల విష-యంలో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. శివ, విష్ణు, ఆంజనేయస్వామి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

Read more RELATED
Recommended to you

Latest news