రాష్ట్రం ఏర్పాటు చేసిన సెక్యూరిటీపై తనకు నమ్మకం లేనందువల్ల కేంద్ర సిబ్బందితో భద్రత కల్పించాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిండెంట్ రేవంత్ రెడ్డి చేసిన అభ్యర్థనపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని ఈసీ, కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర సిబ్బంది లేదా స్వతంత్ర సంస్థతో తనకు భద్రత కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ రేవంత్ ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. భద్రత కోరుతు ఈసీకి, కేంద్ర హోంశాఖకు దరఖాస్తు చేసినప్పటికీ స్పందన రాలేదని రేవంత్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో రేవంత్ రెడ్డికి భద్రత ఎవరు కల్పించాలో వివరణ ఇవ్వండి అంటూ.. ఈసీ, కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేస్తూ తీర్పు వెలువరించింది.