ప‌వ‌న్ గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిస్తే ఆయ‌నేం చేస్తారు ? : చిన‌రాజ‌ప్ప‌

-


అమరావతి: తితిలీ సాయంపై జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ను క‌ల‌వ‌డాన్ని ఏపీ హోంమంత్రి చిన‌రాజ‌ప్ప ఆక్షేపించారు. ప‌వ‌న్ గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిస్తే ఆయ‌నేం చేస్తార‌ని ప్ర‌శ్నించారు. టిట్లీ తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెలాఖరు కల్లా సాధారణ పరిస్థితులు తీసుకువస్తామని చినరాజప్ప అన్నారు. టిట్లీ తుపాన్‌పై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తుపాన్‌ వల్ల పెద్ద ఎత్తున నష్టం సంభవించిందని.. 4,372 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. టిట్లీ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారని అన్నారు.

అక్టోబర్‌ 26 నుంచి 30 వరకు తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు మరోసారి పర్యటించి నష్టపరిహారం అందజేస్తారని చినరాజప్ప పేర్కొన్నారు. తుపాన్‌కు సాయంగా కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. తను వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version