ఏందో ఈ ప్రపంచం. ఈ లోకంలో ఎన్ని విషయాలు తెలుసుకున్నా.. ఏదో ఒక లోటు ఉంటూనే ఉంటుంది. ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి వస్తుంది. మనకు అంతా తెలుసని తెగ ఫీలయి పోతుంటాం. కానీ.. మనకు తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత అని తెలుసుకునే సరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇప్పుడు ఈ సోదంతా ఎందుకంటే.. రీసెంట్‌గా ఓ భయంకరమైన.. వింత ఆకారంలో ఉన్న ఓ సముద్రపు జీవి ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. దాని పేరేంటో తెలుసా? హెడ్‌లెస్ చికెన్ మాన్‌స్టర్. అరె.. ఇదేం పేరు అని దీర్ఘాలు తీయకండి. ఎందుకంటే దానికి తల లేదు. దాన్ని చూస్తేనే దడుసుకుంటారు మీరు. నమ్మరా.. అయితే ఈ వీడియో చూడండి.. మీకే అర్థమవుతుంది.
Behold the majestic "headless chicken monster" or Enypniasties eximia, spotted recently in the Southern Ocean for the first time on an Australian fisheries camera. https://t.co/jQHv5L0uE3 pic.twitter.com/ZeChEiivCy
— Antarctic Division (@AusAntarctic) October 20, 2018
చూశారుగా వీడియో దక్షిణ మహాసముద్రంలో ఈ జీవి కెమెరా కంటికి చిక్కింది. ఎర్రగా ఉన్న ఈ జీవి అసలు పేరు కుకుంబర్. 2017లో గల్ఫ్ ఆఫ్ మెక్సిలో దీన్ని కనిపెట్టారు. కానీ.. కెమెరాకు మాత్రం అప్పుడు చిక్కలేదు. ఇప్పుడు దక్షిణ మహాసముద్రంలో ఇది కెమెరాకు చిక్కింది. ఆస్ట్రేలియాకు చెందిన ఆస్ట్రేలియన్ ఫిషరీస్ అనే సంస్థ సముద్ర గర్భంలో ఏర్పాటు చేసిన కెమెరాలకు ఈ జీవికి చిక్కింది.