వాట్సాప్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్..మరో కొత్త ఫీచర్..

-

ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. కొత్త ఫీచర్స్ తో యువతను ఆకట్టుకుంటుంది.. ఇక ఇప్పుడు సరికొత్త ఫీచర్​ను లాంచ్​ చేసింది. అదే.. ‘ఛాట్​ లాక్​’ ఫీచర్​. ఈ ఫీచర్​తో వినియోగదారుల ఛాట్స్​కు అదనపు భద్రత లభిస్తుందని మెటా సీఈఓ మార్క్​ జుకర్​బర్గ్​ తెలిపారు. ఛాట్​ లాక్​ను మీ ముందుకు తీసుకొస్తుండటం చాలా ఎగ్జైటింగ్​గా ఉంది. మీ కీలకమైన ఛాట్స్​కు ఇది అదనపు భద్రతను కల్పిస్తుంది అని వాట్సాప్​ ఓ ప్రకటనలో తెలిపింది.

ఏదైనా ఛాట్​ను లాక్​ చేస్తే.. అది ఇన్​బాక్స్​లో ఇక కనిపించదు.. ఈ ఛాట్​ మరో ఫోల్డర్​కు మారిపోతుంది. ఆ ఫోల్డర్​ను పాస్​వర్డ్​ లేదా ఫింగర్​ప్రింట్​తోనే ఓపెన్​ చేయగలరు. సంబంధిత ఛాట్​ నుంచి ఏదైనా మెసేజ్​ వచ్చినా.. ఆ నోటిఫికేషన్​ ఆటోమెటిక్​గా హైడ్​ అయిపోతుంది.ఈ ఫీచర్ ను రానున్న నెలల్లో ఈ ఛాట్​ లాక్​ ఫీచర్​కు మరిన్ని ఆప్షన్స్​ తీసుకొస్తాము. యునీక్​ పాస్​వర్డ్​తో లాక్​ చేసుకునే వెసులుబాటును కల్పించడం ఇందులో ఒకటి అని ఈ ఫేస్​బుక్​ ఆధారిత వాట్సాప్​ పేర్కొంది.

చాట్ ను ఎలా లాక్ చెయ్యాలి?

ముందుగా మీ వాట్సాప్​ను అప్డేట్​ చేయండి. లేటెస్ట్​ వర్షెన్​ డౌన్​లోడ్​ అవుతుంది.

మీరు ఏ ఛాట్​ని లాక్​ చేయాలని భావిస్తున్నారో.. దాని ప్రొఫైల్​ పిక్చర్​ మీద క్లిక్​ చేయండి.

మీకు కొత్తగా ఓ ఆప్షన్​ కనిపిస్తుంది. అదే ‘ఛాట్​ లాక్​’. డిసప్పియరింగ్​ మెసేజ్​ మెన్యూ కింద ఉంటుంది.

ఛాట్​ లాక్​ను ఎనెబుల్​ చేయండి. ఇందుకు మీరు పాస్​వర్డ్​ లేదా ఫింగర్​ప్రింట్​ ఇవ్వాల్సి ఉంటుంది.

లాక్​ చేసిన ఛాట్​ను చూడాలంటే.. మీ వాట్సాప్​ హోం పేజ్​ని కిందకి స్వైప్​ చేయండి. అప్పుడు మీరు పాస్​వర్డ్​ లేదా ఫింగర్​ప్రింట్​ను ఇవ్వాల్సి ఉంటుంది.. అంతే.. ఇక ఇంకా ఫ్యూచర్ లో ఎన్నో ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version