విద్యార్థులకు అలర్ట్‌…పాఠశాలలకు సెలవు ప్రకటించిన సర్కార్‌

-

విద్యార్థులకు అలర్ట్‌…పాఠశాలలకు సెలవు ప్రకటించాయి ప్రభుత్వాలు.  తమిళనాడు, పుదుచ్చేరి లో భారీ వర్షాల ప్రభావంతో అక్కడ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.  తమిళనాడులో భారీ వర్షాలు చెన్నైతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు.
rain-school
వర్షాల కారణంగా చెన్నై, చెంగల్పట్టు,tiruvallur , కాంచీపురం,mailadudurai , తిరువారూర్, తంజావూరు, పుదుక్కోట్టై, అరియలూర్, రామనాథపురం, వెల్లూరు, రాణిపేట్, తిరుపత్తూర్, కరూర్, తూత్తుకుడి జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తిరువణ్ణామలై జిల్లాలో పాఠశాలలు మరియు కాలేజీలకు సెలవు ప్రకటించారు చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకారం, చెన్నై, తిరువళ్లూర్, చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం, కల్లకురిచ్చి, తంజావూరు, తిరువారూర్ మరియు పుదుచ్చేరి ప్రాంతాల్లో మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈ రోజు ఉదయం 5:30 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి:
•కారైకాల్: 8 సెం.మీ.
•ఆదిరామపట్టినం, వృద్ధాచలం: 7 సెం.మీ.
•నాగపట్టినం, తిరువారూర్, కడలూరు, పూనమలై, రెడ్ హిల్స్: 6 సెం.మీ.
•చెన్నై నుంగంబాక్కం: 5 సెం.మీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version