బీజేపీ ఎంపీలు మాపై దుష్ప్రచారం చేస్తున్నారు – ఎంపీ చామల

-

బిజెపి ఎంపీలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బిజెపి ఎంపీలు తమపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము పార్లమెంట్ బయటే నిరసనలు తెలుపుతున్నామని.. ఉభయ సభలకు ఎలాంటి ఆటంకం కలిగించడం లేదని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ తమ వల్లే సభకు అంతరాయం కలుగుతుందని బిజెపి ఎంపీలు దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

అటు మాజీ మంత్రి కేటీఆర్ పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఏఐసీసీ అగ్రి నేత రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు ఫామ్ హౌస్ లో పడుకున్న బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ని మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీకి తీసుకురావాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై తమకు బాధ్యత ఉందన్నారు ఎంపీ చామల.

తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకనే విషం కక్కుతూ ఏడాదికాలంగా కేటీఆర్, హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీకి రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ తెలుసని.. అప్పుల కోసమే ప్రతి నెల ఎంతో ఖర్చు పెట్టాల్సి వస్తుందన్నారు. అయినప్పటికీ ప్రతినెలా ఒకటవ తేదీన జీతాలు వచ్చేలా పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కోసం, ప్రజలకు మంచి చేయడం కోసం పనిచేస్తుందన్నారు ఎంపీ చామల.

Read more RELATED
Recommended to you

Exit mobile version