సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా ఈనెల 26 నుంచి సెంచూరియన్ వేదికగా మొదటి టెస్టులో టీమిండియా సఫారీ లతో తలపడనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత మూడు దశాబ్దాలుగా సఫారీ గడ్డపై ఒక టెస్టు సిరీస్ కూడా నెగ్గని భారత్… ఈసారి ఎలాగైనా టెస్ట్ సిరీస్ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో టీమిండియా ఉన్నదని అన్నారు.
ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ…. గతంలో టీమిండియా సౌత్ ఆఫ్రికాలో చాలా టెస్ట్ మ్యాచ్లు ఆడిందని కానీ సిరీస్ మాత్రము చేజేకించుకోలేదని అన్నారు. ఈసారి టెస్ట్ సిరీస్ నెగ్గడమే మా లక్ష్యం అని తెలిపాడు.
1992 నుంచి సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్తున్న ఇండియా…ఇంతవరకూ ఒక్క టెస్టు సిరీస్ గెలవలేదు. అజారుద్దీన్, ద్రావిడ్,సౌరవ్ గంగూలీ, సచిన్ , ధోని, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ సారథులు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినా సీరీస్ గెలువకుండానే స్వదేశానికి తిరిగొచ్చారు.
అలాగే ప్రపంచ కప్ ముగిసిన నేపథ్యంలో… తను వచ్చే ఏడాది జరగబోయే టి20 ప్రపంచ కప్ కి ఆడతాడా లేదా అనే విషయం పైన విలేకరులు ప్రశ్నలు అడగారు. దీనికి సమాధానం తర్వాత దొరుకుతుందని దాటవేశాడు.