దివ్యాంగులకు అన్ని విధాల అండగా ఉన్న నాయకుడు కేసీఆర్‌ : హరీశ్‌ రావు

-

దివ్యాంగులకు అన్ని విధాల అండగా ఉన్న లీడర్, మానసిక దివ్యాంగుల పట్ల మానవతా హృదయాన్ని చాటుకున్న నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు.

సిద్దిపేట జిల్లా కేంద్రంలో లయన్స్, అలాయన్స్, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అభయ జ్యోతి ద్వారా ఏర్పాటు చేసిన మానసిక దివ్యాంగులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. గతంలో సీఎం కేసీఆర్ దివ్యంగులకు 4000 పింఛన్ ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు 6000 ఇస్తామని చెప్పారని వాటిని వెంటనే ఇవ్వాలని హరీష్ రావు దివ్యాంగుల తరపున డిమాండ్ చేశారు.

 

సిద్దిపేటలో కంటి సమస్యలు పరిష్కారం అయ్యేలా ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ ఏర్పాటు చేశామని దీనిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.నాజీతం నుంచి కొంత మానసిక దివ్యాంగులకి కేటాయించి ఆర్థిక సాయం చేస్తానన్నారు.తన వంతు సహాయం అభయ జ్యోతి శాశ్వత భవన నిర్మాణానకి ఇస్తానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news