సాయి పల్లవి చెల్లెలు ఎంగేజ్మెంట్ వేడుకలు షురూ…..

-

హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది.లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు పొందారు . అయితే సాయి పల్లవి సిస్టర్ ‘పూజ కన్నన్’ ఆమె పోలికలతోనే కనిపిస్తూ అభిమానులని ఆకట్టుకుంటుంటారు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే పూజకి ఇన్‌స్టాగ్రామ్ లో మంచి ఫాలోయింగే ఉంది.

 

ఇది ఇలా ఉంటే, పూజ కన్నన్ తన సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ వేశారు. ఆ పోస్టులో తన ప్రియుడిని పరిచయం చేసింది.అయితే ప్రియుడిని పరిచయం చేసి వారం కాకముందే అప్పుడే ఎంగేజ్మెంట్ అంటూ ఫోటోలు షేర్ చేశారు.పూజ కన్నన్ తన ఇన్‌స్టా స్టోరీలో ఎంగేజ్మెంట్ అంటూ షేర్ చేసిన ఆ పిక్స్ లో పూజ చేతికి మెహందీతో కనిపిస్తున్నారు. ఒక ఫొటోలో సాయి పల్లవి కూడా కనిపిస్తున్నారు. మరి ఈ ఎంగేజ్ మెంట్ వేడుక ఎప్పుడు, ఎక్కడ జరగబోతుందో అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక అక్కకంటే ముందే చెల్లెలు వివాహం చేసుకోనున్న నేపథ్యంలో అందరూ ఆమెకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news