సూర్యాపేట జిల్లాలో దారుణం..దుబాయ్ నుండి వచ్చిన భర్తకు అఫైర్ గురించి తెలిసిందని..!

-

సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది అక్రమ సంబంధం భయట పడిందనే కారణం తో ఓ భార్య భర్తను హత్య చేయించింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కుప్పల కుంట తాండలో ఈ నెల 10న బాలాజీ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అయితే ఈ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముందుగా సహజ మరణం అని పోలీసులు భవించగా ఇది హత్య అని బాలాజీ సోదరుడు నెహ్రూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దాంతో సీఐ శివరామిరెడ్డి ఆధ్వర్యం లో దర్యాప్తు జరపగా ఈ హత్యను బాలాజీ భార్య బుజ్జి చేయించినట్లు తెలిసింది. ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లిన బాలాజీ కొన్నేళ్ల పాటు అక్కడే ఉండి ఇటీవల గ్రామానికి వచ్చారు. అయితే భార్య బుజ్జి తండా కు చెందిన పరశురామ్ అనే వ్యక్తి తో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు బాలాజీ కి తెలిసింది. దాంతో ఎలాగైనా తొలగించుకోవాలని 6గురికి రూ.90 సుఫారి ఇచ్చి హత్య చేయించింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version