హృతిక్‌ రోషన్ ‘ఫైటర్’ ట్రైల‌ర్ టైం ఫిక్స్.. ఎప్పుడంటే.

-

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌ రోషన్‌ కథానాయకుడిగా,దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘ఫైటర్‌’. అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. పఠాన్, వార్ సినిమాల‌ ఫేమ్ సిద్దార్ధ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హిస్తున్నాడు. రిప‌బ్లిక్ డే కానుక‌గా జనవరి 25న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక విడుద‌ల తేదీ దగ్గర పడుతుండడంతో మేక‌ర్స్ ప్రమోష‌న్స్ వేగం పెంచారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి టీజ‌ర్‌,పాట‌ల‌కు విడుద‌ల చేయ‌గా.. ప్రేక్ష‌కుల వ‌ద్ద నుంచి మంచి స్పందన వ‌చ్చింది.

 

అయితే ఈ సినిమా ట్రైల‌ర్‌ను సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15న మధ్యాహ్నం 12 గంట‌లకు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో హృతిక్‌రోషన్‌ యుద్ధ విమానాన్ని నడిపించే పైలట్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలపై రామన్ చిబ్, అంకు పాండే,మమతా ఆనంద్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news