సిద్దిపేట అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. దక్షిణ భారత దేశంలో సిద్దిపేటకు క్లిన్ సిటీగా స్వచ్ఛ అవార్డు వచ్చిందని తెలిపారు. చరిత్ర పుటల్లో సిద్ధిపేట ఒక అధ్యాయంగా మారుతుందని ఆయన అన్నారు. అమర్ నాథ్ సేవా సమితి వారు అమర్ నాథ్ లో 11వ సారి కేదార్ నాథ్ ,అమర్ నాథ్ లలో సేవ చేయడం అదృష్టమనీ చెప్పారు. అన్ని దానాల్లో అన్నదానం చాలా గొప్పదన్నారు. అన్నదానాల్లో సిద్దిపేటకు పెట్టింది పేరన్నారు ఎమ్మెల్యే హరీశ్ రావు. సిద్దిపేటలో కొన్ని దేవాలయాల్లో నిత్య అన్నదానం చేస్తున్నామని తెలిపారు. క్యాంపు ఆఫీసులో తాను కూడా రోజు అన్నదానం చేస్తానని చెప్పారు.
గరికపాటి,చాగంటి వంటి వారి ప్రవచనాలతో భక్తి భావం పెరిగిందని హరీశ్ రావు అన్నారు. హిందు ధర్మం పరిరక్షణ కోసం భక్తులు ఉన్నారని… మానవసేవే మాధవ సేవ అని ఆయన అన్నారు. సిద్దిపేటలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి శాశ్వత భవనం నిర్మిస్తామని అన్నారు.