దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్న రాఫెల్ యుద్ధం విమానాల కొనుగోలు గురించి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హెచ్ఏఎల్ ఉద్యోగులతో ఇష్టాగోష్టినిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పదవీ విరమణ చెందిన వారితో సహా ఉద్యోగులతో మాట్లాడారు. మనకు స్వాతంత్య్రం భారత్ సంపాదించుకున్న ఆస్తుల్లో హెచ్ఎఎల్ ఒకటని అన్నారు. విమానయాన రంగంలో అమెరికాను సవాలు చేయగల దేశాలంటే భారత్, చైనాలు మాత్రమేనని గతంలో బరాక్ ఒబామా వ్యాఖ్యానించారంటే అది కేవలం హెచ్ఎఎల్ వల్లేనన్నారు.