నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో ఫుడ్ పాయిజన్.. 10 మందికి అస్వస్థత

-

నిర్మల్ జిల్లా కేంద్రంలోని అనంతపేట్ కేజీబీవీలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. దీంతో 10 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులకు ఉడికీ ఉడకని బియ్యంతో అన్నం పెట్టడంతోనే వారు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వాంతులు, కడుపునొప్పితో విద్యార్థినులు బాధపడుతున్నట్లు తెలిసింది.

ఈ విషయం తెలియడంతో బాధిత విద్యార్థినులను మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అందులో ఐదుగురి పరిస్థితి మెరుగుపడటంతో పాఠశాలకు పంపించారు.మరో ఐదుగురిని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు.
ఎంఈవోఓను వివరణ కోరగా భోజనం తయారు చేసే నిర్వాహకులు కొత్తగా విధుల్లో చేరినట్లు, అన్నం వండడంలో సరైన అవగాహన లేక కొంతమేర ఉడకలేదని, దానిని తిన్న విద్యార్థులు వాంతులు చేసుకున్నట్టు వివరణ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version