యునైటెడ్ కింగ్డమ్ లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు… క్రమ క్రమంగా విజృంభిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో యూకేలో ఏకంగా పది వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు రావడం ఆందోళనకు గురిచేస్తోంది. అలాగే ఒమిక్రాన్ మరణాల సంఖ్య ఏడు కు చేరుకుంది. అంతకు ముందు రోజు ముప్పై రెండు వందలకు పైగా కేసులు నమోదు కాగా.. తాజాగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది.
దీంతో యూకేలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 24, 968 కు చేరుకుంది. అయితే గడచిన 24 గంటల్లో ఆ కంట్రీ లో 90, 148 కరోనా మహమ్మారి కేసులు నమోదు అయ్యాయి. అలాగే నిన్న ఒక్కరోజే 125 మంది కరోనా కారణంగా మృతి చెందారు. బ్రిటన్‌లో ఒక్కరోజే 10 వేల ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో.. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62 వేలు దాటింది. అటు భారత దేశం లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 152 కి చేరింది. అయితే ఇండియా లో ఎక్కడా కూడా ఒక్క ఒమిక్రాన్ మరణం సంభవించలేదు.