జమ్ము కాశ్మీర్ లో మేకలు, గొర్రెల సరాఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో జమ్మూ కాశ్మీర్ లో వివాహ వేడుకలు వాయిదా పడే పరిస్థితి ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్ లో వివాహాలకు దాదాపు 20 నుంచి 30 రకాల భక్ష్యలతో మాంసాహార వంటకం “వాజవాన్” వడ్డిస్తారు. ఇందుకోసం పంజాబ్, ఢిల్లీ, హర్యానా నుంచి నిత్యం 500 గొర్రెలు సరఫరా అవుతాయి.

వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వీటి సరాఫరా నిలిచిపోవడంతో మాంసం కోసం అడ్వాన్స్డ్ ఇచ్చిన వాళ్లు వారి వివాహాలను వాయిదా వేసుకోవాలని మటన్ డీలర్స్ అసోసియేటర్ సూచించారు. దీంతో వివాహాలు చేసుకునేవారు వారి వివాహాన్ని వాయిదా వేసుకుంటున్నారు. వివాహంలో వారి బంధువులకు మాంసాహారం లేకుండా భోజనాలు పెట్టించలేమని కొంతమంది వారి వివాహాలను రద్దు చేసుకుంటే మరి కొంతమంది మాంసాహారం కన్నా ముహూర్తం బాగుండాలని కొంతమంది అనుకున్న తేదీలకే వివాహాలు చేసుకుంటున్నారు. తొందరలోనే జమ్మూ కాశ్మీర్లో మేకలు, గొర్రెల సరాఫరా జరగాలని కోరుతున్నారు.