నేపాల్‌లో పరిస్థితులు అత్యంత ప్రమాద కరంగా మారాయి. నేపాల్‌లో కర్ఫ్యూ విధించారు ఆర్మీ అధికారులు. దీంతో సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది భారత్. రాజ్యాంగాన్ని తిరగరాయాలని డిమాండ్ చేశారు యువ నిరసనకారులు. జెన్-జెడ్ ఆందోళనతో అల్లకల్లోలమైంది నేపాల్. నిరసనకారులతో నేడు సమావేశమవనున్నారు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్.

అటు ఇప్పటికే ప్రధాని కెపి శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. సైన్యం సూచనతో కేపి రాజీనామా చేస్తున్నట్లుగా స్పష్టం చేశారు. ఆయన నేపాల్ నుంచి దుబాయ్ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో సాయంత్రం కొత్త ప్రధాని పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కాగా వందలాది మంది నిరసనకారులు ఓలి ఇంటి వద్ద ఆందోళన చేస్తున్నారు. ఆయన ఇంటికి నిప్పంటించారు.
ఓలి రాజీనామా చేయడంతో సైనిక పాలన విధిస్తారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో నిషేధం విధించడంపై నేపాల్ లో సోమవారం యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేపాలి యువత ఖాట్మండులో నిరసనకు పిలుపునిచ్చింది.