ముంబైలో దారుణం.. 10వ తరగతి బాలికపై తండ్రి, అన్న అత్యాచారం.. !

-

దేశంలో మహిళలపై దాడులు ఏ మాత్రం తగ్గటం లేదు. ఏదో మూలన… కొందరు దుర్మార్గులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా ముంబైలో ఓ 16 ఏళ్ల బాలికపై కన్నతండ్రి, తోడబుట్టిన అన్న రెండేళ్లుగా అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో… ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తనకు ఎదురైన దారుణ అనుభవాన్ని ఆ పదవ తరగతి అమ్మాయి తన స్కూల్ టీచర్, ప్రిన్సిపాల్ కు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

 

స్కూల్ యాజమాన్యం ఓ స్వచ్ఛంద సంస్థకు ఈ విషయాన్ని చెప్పింది. వారి సహాయంతో ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2019 సంవత్సరంలో జనవరి లో మొదటిసారిగా… 43 ఏళ్ల తన తండ్రి తన పై అఘాయిత్యాలకు పాల్పడడం ఈ ఫిర్యాదులో పేర్కొంది. ఆ తరువాత అదే నెలలో తన అన్న కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు చేసింది ఆ బాలిక. తన చెల్లెలు పైన అదే తరహాలో లైంగిక దాడి చేస్తారేమో అని భయమేసి ఈ ఘటనను స్కూల్ టీచర్లకు చెప్పినట్లు బాలిక తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version