టెన్త్ మార్కుల‌పై ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్న‌యం..!

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌దోత‌ర‌గ‌తి మార్కుల‌పై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలోప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు గ్రేడ్ లు మ‌రియు పాయింట్ ల రూపంలో ఫ‌లితాల‌ను ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే మ‌ళ్లీ విద్యార్థుల‌కు మార్కుల ద్వారానే ఫ‌లితాల‌ను ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. పాయింట్స్, గ్రేడ్స్ ద్వారా విద్యార్థుల‌కు ఇత‌ర కోర్సుల్లో ఎంట్రీ ఇచ్చేటప్పుడు..అలాగే పై చ‌దువుల‌కు మ‌రియు ఉద్యోగాల ఎంపిక‌లో ఇబ్బందులు వ‌స్తున్నాయ‌న్న నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకుంది.

ఒకే గ్రేడ్ మ‌రియు పాయింట్స్ వ‌చ్చిన వారికి పై త‌ర‌గ‌తులకు సీట్లు కేటాయించాలంటే అయోమ‌యంలో ప‌డాల్సిన ప‌రిస్థితులు వ‌స్తున్నాయి. ఈనేప‌థ్యంలోనే స‌ర్కార్ ఈ నిర్ణ‌యం తీస‌కుంది. ఇక 2020-2019 బ్యాచ్ నుండే గ్రేడ్ లు మ‌రియు పాయింట్ ల స్థానంలో మార్కుల విధానాన్ని అమలు చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version