10వ తరగతి పరీక్ష ఫలితాల తో చాలా మంది విద్యార్థులు హ్యాపీ అయిపోతున్నారు. ఈసారి టెన్త్ ఫలితాల్లో బాలికలే ముందు వున్నారు. అలానే పాస్ పెర్సెంటేజ్ కూడా ఎక్కువగానే వుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక సంఘటన చోటు చేసుకుంది. 93.5 శాతం మార్కులు చూసి మూర్ఛపోయారు ఒక విద్యార్థి. ఐసీయూలో చేర్పించారు.
పూర్తి వివరాలు చూస్తే, ఉత్తరప్రదేశ్ మీరట్ లోని మోడిపురం మహర్షి దయానంద్ ఇంటర్ కాలేజ్ లో 10వ తరగతి చదివే అన్షుల్ కుమార్ కి టెన్త్ లో 93.5 శాతం మార్కులు రావడంతో ఉప్పొంగిపోయి మూర్ఛబోయాడు. వెంటనే ఆస్పత్రికి తీసికెళ్లారు. అన్షుల్ ఆరోగ్యం ప్రస్తుతం కుదుటపడింది.