ఓవైపు సార్వత్రిక ఎన్నికలు.. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలతో దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం కొట్టొచ్చి నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రజల్లో గుర్తింపు పొందేందుకు ఎవరు చేయని ఆలోచనలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్దమైన ఓ యువతీ వినూత్న రీతిలో నామినేషన్ దాఖలు చేశారు.
కరీంనగర్ కి చెందిన పేరాల మనసా రెడ్డి అనే యువతి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కాగా నామినేషన్ వేసేందుకు డిపాజిట్ చెయ్యాల్సిన రూ.25 వేలను ఆమె చిల్లర రూపంలో చెల్లించారు. కాగా ఆమె చెల్లించిన ఆ చిల్లరలో ఒక రూపాయి నుండి పది రూపాయల నాణాలు ఉన్నాయి. అయితే ఇలా చిల్లరతో నామినేషన్ వేయడం ఇదే మొదటి సారి కాదు. రెండు రోజుల క్రితం శ్రీకాకుళం లోనూ ఓ అభ్యర్థి ఇలా చిల్లర చెల్లించి నామినేషన్ వేశారు. అలానే ఎంపీగా పోటీ చెయ్యాలని అనుకున్న ఓ రిక్షావాలా కూడా ఇలానే నామినేషన్ వేశారు.