బంగారు పూతతో 111 అడుగుల ఎత్తైన శివుని విగ్రహం.. రేపే ఆవిష్కరణ

-

శివరాత్రి వచ్చేస్తుంది. రేపు శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలోని ప్రసిద్ధ సుర్‌సాగర్ సరస్సు మధ్యలో రూ. 12 కోట్లతో 17.5 కేజీల బంగారు పూతతో ఏర్పాటుచేసిన 111 అడుగుల ఎత్తైన శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..మంజల్‌పూర్‌ ఎమ్మెల్యే యోగేష్‌ పటేల్‌ ఆధ్వర్యంలోని సత్యం శివం సుందరం సమితి అనే ట్రస్ట్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. 1996లో ప్రారంభమైన ఈ విగ్రహ పనులు 2002లఅో పూర్తయ్యాయి. అయితే ఈ విగ్రహాన్ని అప్పుడు బంగారు పూతతో ఏర్పాటు చేయలేదు. రాగితోనే చేశారు..
ఈ విగ్రహం 2012లో ప్రజలకు అంకితం చేసిన 15 ఏళ్ల తర్వాత ఈ విగ్రహానికి బంగారు పూత వేయాలని స్వర్ణ సంకల్ప్ ఫౌండేషన్‌కి ఆలోచన వచ్చింది. అయితే ఇది అసాధ్యం అని అప్పుడు ఎమ్మెల్యే యోగేష్ పటేల్ అన్నారు.అయితే చివరకి దీనికి బంగారు పూతకి అంగీకరించారు. దీనికోసం ఈ ఫౌండేషన్‌కి ప్రజల నుంచి విరాళాలు కూడా వచ్చాయి. 17.5 కేజీల బంగారాన్ని విగ్రహానికి పూత కోసం వినియోగించిన విషయాన్ని ఎమ్మెల్యే పటేల్ స్వయంగా బయటపెట్టారు. ఆ బంగారు పూతకి రూ.12 కోట్లు ఖర్చు అయిందన్నారు.
వడోదరలో ఏటా నిర్వహించే శివుడి ఊరేగింపు సుర్‌సాగర్ దగ్గర ముగుస్తుంది. అప్పుడు విగ్రహం దగ్గర హారతి ఇవ్వబడుతుంది. బంగారు పూతతో ఏర్పాటు చేసిన 111 అడుగుల శివుని విగ్రహాన్ని మహాశివరాత్రి సందర్భంగా అధికారికంగా సీఎం భూపేంద్ర పటేల్‌ వడోదరకి అంకితం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version