బీఆర్ఎస్ హయాంలో 12 లక్షల చెట్ల నరికివేత..

-

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చెట్లను నరికివేయరాదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ.. గతంలో అధికారంలో ఉన్నప్పుడ ఏకంగా అడవులను మాయం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఏకంగా లోక్‌సభలో కేంద్ర అటవీశాఖమంత్రి బయటపెట్టినట్లు సమాచారం.


సీపీఐ(ఎంఎల్)ఎంపీ రాజా రామ్ సింగ్ ప్రశ్నలకు కేంద్రం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. గత పదేళ్లలో దేశ వ్యాప్తంగా 1,73,396.87 హెక్టార్లకు పైగా అటవీ భూమిని అటవీయేతర ప్రయోజనాల కోసం ఉపయోగించారని వెల్లడించగా.. ఇందులో 11,422.47 ఎకరాలతో టాప్-3లో తెలంగాణ రాష్ట్రం ఉన్నది. FCA అనుమతులకు విరుద్ధంగా 2016 నుంచి 2019 వరకు తెలంగాణలో 12,12,753 వృక్షాలను తొలగించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news