మాములుగా చిన్న పిల్లలు ఆటలు ఆడుకుంటున్న సమయంలో చిన్న చిన్న గొడవలు జరగడం చూస్తూ ఉంటాము. తాజాగా మహారాష్ట్ర చంద్రాపూర్ లో జరిగిన ఒక సంఘటనలో ఒక 12 ఏళ్ల బాలుడిని కొట్టి చంపిన ఘటన వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటన జూన్ 3న జరుగగా తల్లి కంప్లైంట్ మేరకు ఆలస్యంగా వెలుగు చూసింది. జూన్ 3వ తేదీన క్రికెట్ ఆడుతుండగా ఒక గొడవ జరిగింది. ఒక మైనర్ అబ్బాయి ఆ 12 సంవత్సరాల అబ్బాయిని బ్యాట్ తో బ్లాంగా కొట్టాడు. వెంటనే కింద పడిపోయిన బాలుడిని పక్కన ఉన్న వారి సహాయంతో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ ఆసుపత్రికి చేరే లోపే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. దీనితో అన్యాయముగా వందేళ్ల ప్రాణం ఒక్క బ్యాట్ దెబ్బతో పోయింది.