అన్నదాతలకు గుడ్ న్యూస్.. రూ.13 లక్షలు… ఇలా పొందండి..!

-

కేంద్రం ఇప్పటికే రైతుల కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన చాలా మంది రైతులు ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఇప్పుడు మళ్ళీ రైతులకు తీపికబురు అందించింది. ఫ్రూట్స్, కూరగాయలు పండించే రైతులకు బెనిఫిట్ కలగనుంది. ఇక దీని కోసం పూర్తి వివరాలు చూస్తే.. హార్టికల్చర్ సంబంధిత పంటలు పండించే రైతులకు భారీ సబ్సిడీ అందిస్తున్నట్లు వెల్లడించింది. ఏకంగా 75 శాతం వరకు సబ్సిడీ ఆఫర్ ఇస్తున్నట్టు చెప్పింది. బీహర్ రైతులకు మాత్రమే ఇది ప్రస్తుతం వర్తిస్తోంది. అక్కడి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పంట నష్టం కలుగకుండా ఉండేందుకు రైతులకు ఈ సబ్సిడీ ని ఇస్తోంది.

మరి మన రాష్ట్రం లో ఎప్పుడు ఇది వస్తుందో తెలీదు. అయితే ఇలా చేయడం వలన పంట నష్టం రైతులకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. రిఫ్రిజిరేటెడ్ వెహికల్ వల్ల ట్రాన్స్‌పోర్టేషన్ సమయంలో నష్టం ఏమి కూడా రాదు. రైతులకు సబ్సిడీ అందిస్తున్నట్లు అక్కడి అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్, డైరెక్టరేట్ ఆఫ్ హార్టికల్చర్ ట్వీట్ చేసింది. ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్‌మెంట్ మిషన్ స్కీమ్‌ లో భాగంగా ఎంట్రప్రెన్యూర్లకు 50 శాతం సబ్సిడీ వస్తుంది.

ఎఫ్‌పీవో లేదా ఎఫ్‌పీసీ కి 75 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది. రిఫ్రిజిరేటెడ్ వెహికల్ ధర రూ. 26 లక్షలు కాగా సబ్సిడీ రూపంలో ఏకంగా రూ. 13 లక్షల తగ్గింపు వుంది. అదే 75 శాతం సబ్సిడీ అంటే ఏకంగా రూ. 19 లక్షల వరకు సబ్సిడీ వస్తుంది. ఈ స్కీము వలన అక్కడ వాళ్లకి ఎంతో మేలు కలగనుంది. ఇలాంటి పథకాలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంటే రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. ట్రాక్టర్లు, ఇతర ఫామ్ మిషనరీ పై కూడా సబ్సిడీ ఉంటే కూడా ఎంతో బాగుంటుంది. రైతుల కి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version